Tomato | పుణె: దేశంలో టమాట ధర కిలో వంద రూపాయలు దాటడంతో వాటి చోరీలు కూడా ఎక్కువయ్యాయి. పంటను కోసి మార్కెట్కు తరలించడానికి వాహనంలో ఉంచిన 400 కేజీల టమాటాలు రాత్రికి రాత్రే చోరీ కావడంతో ఒక రైతు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
పుణె జిల్లా పింపర్ఖేడ్కు చెందిన అరుణ్ ధామ్ తన పొలంలో పండిన 400 కిలోల టమాటాలను పెట్టెల్లో సర్ది వాటిని రాత్రి ఒక వాహనంలో ఉంచి ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం వాహనాన్ని మార్కెట్కు తీసుకెళ్దామని చూడగా టమాటాలున్న బాక్స్లన్నీ చోరీ అయ్యాయి.