పాట్నా: జూలై 23: రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అవసరమైతే బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ బుధవారం సూచనప్రాయంగా వెల్లడించారు. అన్నీ ముందుగానే నిర్ణయించేస్తే ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే విషయాన్ని కూడా ప్రతిపక్షం యోచిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం బీహార్లో ఈసీ చేపట్టిన వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రస్తావిస్తూ తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిగ్గింగ్ ప్రయత్నంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఇండియా కూటమి ఆరోపించింది.