ఈవీఎం లోపాలపై కేంద్రం మూగనోము
ఈవీఎం, వీవీప్యాట్ లోపాలపై నాలుగేండ్లుగా ప్రశ్నిస్తున్నా ఎందుకు స్పందిం చడంలేదని కేంద్రాన్ని విపక్షం నిలదీసింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ఈవీఎం, వీవీప్యాట్ లోపాలపై నాలుగేండ్లుగా ప్రశ్నిస్తున్నా ఎందుకు స్పందిం చడంలేదని కేంద్రాన్ని విపక్షం నిలదీసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం), ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేతలు, నిపుణులు ఇప్పటికే ఎన్నికల సంఘానికి (ఈసీ) పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్లలోని ఓట్ల సంఖ్యలో ఏమైనా వ్యత్యాసాన్ని గుర్తించారా? అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం పలువురు విపక్ష ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే, నాలుగేండ్లు గడిచినప్పటికీ, ఇంకా దానిపై కేంద్రం స్పష్టతనివ్వలేదు. ఇదే అంశంపై పార్లమెంట్లో ఓ సభ్యుడు తాజాగా ప్రశ్నించారు. కేంద్రం స్పందిస్తూ.. దీనిపై పలుమార్లు సంప్రదించినా ఈసీ స్పందించలేదని చెప్పుకొచ్చింది.
సందేహాలు తీర్చాల్సిందే
మరికొద్దీ రోజుల్లో ఐదు రాష్ర్టాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఈవీఎం, వీవీప్యాట్లపై నెలకొన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఈసీపై ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటరీ ప్యానెల్ న్యాయశాఖకు కీలక సూచన చేసింది. ఈవీఎం, వీవీప్యాట్ల మధ్య ఓట్ల సంఖ్యలో వ్యత్యాసాలకు సంబంధించిన వివరాలను వెంటనే తెప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

