అగర్తల: భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో పోరాడిన ఆర్మీ బెటాలియన్ను త్రిపురలో మోహరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం తెలిపారు. బంగ్లాదేశ్లో అశాంతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీ లీగల్ సెల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిణామాలు, వాటి ప్రభావం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ముక్తి బహినికి శిక్షణనిచ్చిన, 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న బెటాలియన్ ఇప్పుడు త్రిపురలో ఉందన్నారు. అంతర్జాతీయ సరిహద్దులో సైన్యం లేదని కొందరు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ రోజుల్లో యుద్ధం చేయడానికి సైనికులు భౌతికంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, శత్రువులను నాశనం చేయడానికి ఒక క్లిక్ చాలునని వివరించారు.