భోపాల్, జూన్ 29: నూతన ‘జాతీయ విద్యా విధానం’ (ఎన్ఈపీ)లో భాగంగా వీడీ సావర్కర్‌పై పాఠ్యాంశాల్ని మధ్యప్రదేశ్ స్కూల్ సిలబస్‌లో చేర్చుతున్నామని ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఇందర్‌సింగ్ పార్మర్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.
కాంగ్రెస్ మీడియా సెల్ చైర్పర్సన్ కేకే మిశ్రా మాట్లాడుతూ, ‘ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ సర్కార్ ఎన్నికల స్టంట్ ఇది. అధిక ధరలు, నిరుద్యోగం సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విభజన రాజకీయాల్ని ముందుకు తెస్తున్నది. గోవుల్ని పెంచండి కానీ, వాటిని పూజించవద్దని సావర్కర్ చెప్పిన విషయాల్ని కూడా సిలబస్‌లో చేర్చాలి’ అని అన్నారు.