ముంబై: ముంబైలో రూ.1745 కోట్ల విలువైన కొకైన్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా ప్లాన్‌ను ఎన్సీబీ సమర్థంగా ఛేదించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నాణ్యమైన 349 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ ముంబైలో సీజ్ చేసిందని ఆయన వెల్లడించారు. ‘చిన్న సరకును గుర్తించి.. దాని ఆధారంగా పెద్ద నెట్‌వర్క్‌ను ఎన్సీబీ పట్టుకుంది.
ఈ అద్భుత విజయానికి వారికి అభినందనలు’ అని షా ప్రశంసించారు. అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం సహాయకుడు, మాదక ద్రవ్యాల స్మగ్లర్ సలీం డోలాను తుర్కియే నుంచి భారత్‌కు తీసుకొచ్చిన కొన్ని రోజులకే పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది.