న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సైనిక్ పాఠశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్ని (ఏఐఎస్ఎస్ఈఈ-2024) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ (exams.nta.ac.in/AISSEE) సందర్శించాలని అధికారులు తెలిపారు. 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం జనవరి 28న దేశవ్యాప్తంగా 185 నగరాల్లోని 450 సెంటర్లలో ‘ఏఐఎస్ఎస్ఈఈ-2024’ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.