జైపూర్ : జైపూర్‌లో శనివారం నిర్వహించిన ఆయుర్వేదిక్ పీజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ట్రాన్స్‌పోర్టు నగర్లో ఉన్న సత్యసాయి పీజీ కాలేజీలో నిర్వహించిన ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా జరుగుతుండగా.. 20 నిముషాల తర్వాత కరెంట్ పోయింది. కానీ కొందరి కంప్యూటర్లు మాత్రం అలాగే పనిచేశాయి. ఆ సమయంలో కొందరు మాట్లాడుకుంటూ చీటింగ్‌కు పాల్పడ్డారని మహిళా అభ్యర్థులు ఆరోపించారు.
ఎంతసేపటికీ కరెంట్ రాకపోవడంతో వారంతా బయటకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముందుగా ఎన్టీయే స్పందిస్తూ ఆ 49 మందికి రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది. కానీ పరీక్షలో చీటింగ్ జరిగిందనే ఆరోపణలతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 1న రాజస్థాన్ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తామని స్పష్టం చేసింది.