న్యూఢిల్లీ: ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. జూలై 19 నుంచి ఆగస్టు 13 సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఆ రెండు తేదీల మధ్య మొత్తం 19 పనిదినాల్లో ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా ఇవాళ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్పీకర్.. సమావేశాల నిర్వహణకు సంబంధించి కాసేపు మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి వచ్చే ఎంపీలు, మీడియా ప్రతినిధులు అందరినీ పార్లమెంటు లోపలికి అనుమతిస్తారని స్పీకర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి కాదని చెప్పారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం దయచేసి వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అయితే పార్లమెంట్లో ఇప్పటివరకు మొత్తం 322 మంది ఎంపీలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలకు (లోక్సభ, రాజ్యసభ) ఇవే టైమింగ్స్ వర్తిస్తాయని ఆయన వెల్లడించారు.
Delhi | Lok Sabha Speaker Om Birla takes stock of preparations for the upcoming Monsoon Session of the Parliament from July 19 pic.twitter.com/fzXMJW1YPk
— ANI (@ANI) July 12, 2021