ఎమర్జెన్సీ కంటే దారుణ పరిస్థితులు.. ఢిల్లీ నిర్బంధాలపై ఏకమైన విపక్షాలు
దేశ రాజధానిని బహిరంగ జైలుగా మార్చేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల హక్కులను అణచి వేస్తున్నందుకు మోదీ సర్కార్ మూల్యం చెల్లించక తప్పదు
న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తలపెట్టిన నిరసన ప్రదర్శనపై భద్రతా ఆంక్షలు విధించడంతో శనివారం విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ చర్యను ‘ఎమర్జెన్సీ’తో పోలుస్తూ, ప్రభుత్వం భిన్నాభిప్రాయాలను అణచివేస్తున్నదని ఆరోపించాయి. ఢిల్లీలో ఆంక్షలు, సీజేపీ నేతల నిర్బంధంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేస్తున్నందుకు బీజేపీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని కాంగ్రెస్ నేత పీ చిదంబరం హెచ్చరించారు.
ప్రస్తుత పరిస్థితి ‘ఎమర్జెన్సీ’ కంటే దారుణంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కఠిన ఆంక్షలు, పోలీస్ మోహరింపులు, నిర్బంధాలు, ప్రజా నిరసనల పట్ల ప్రభుత్వానికి ఉన్న భయాన్ని బయటపెడుతున్నాయని విపక్ష నేతలు ఆరోపించారు. ఫ్లైట్ దిగగానే సీజేపీ నేతలను అరెస్టు చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భయాన్ని బయటపెట్టుకున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు, శాంతియుత నిరసనకారులపై సాగుతున్న అణచివేత ఎమర్జెన్సీ(1975-77) నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని అన్నారు. కేరళ సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్.. ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ రాజధానిని ఒక బహిరంగ జైలుగా మార్చిందని, సాయుధ పోలీసులు, పారా మిలటరీ బలగాల ద్వారా నిరసనలను అణచివేయాలని చూస్తున్నదని ఆరోపించారు.
రేపు ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన
ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్ష ఇండియా కూటమి తన పోరాటాన్ని ఉధృతం చేయనున్నది. పోరాటంలో భాగంగా సోమవారం(అక్టోబర్ 12) న్యూఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శనను ఇండియా కూటమి చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం తెలిపారు. ఈ విషయమై తమ ఆందోళనను తెలియచేయడానికి శుక్రవారం కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారని శనివారం విలేకరుల సమావేశంలో వేణుగోపాల్ చెప్పారు.
సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌ను కూటమి నేతలు కలువనున్నారని ఆయన చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు వారి పతనానికి దారితీస్తాయని ఆయన ఆరోపించారు. పతనానికి చేరువలో ఉన్న నాయకుడిలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల నిరసనలకు ఆయన భయపడుతున్నారు అని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CJP
- Gyanesh Kumar
- MK Stalin
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

