కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చించాల్సిందే
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ర్టాలకు నిధుల నిలిపివేత, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
- విపక్ష పార్టీల డిమాండ్
- నేటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ర్టాలకు నిధుల నిలిపివేత, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బుధవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి దాదాపు 30కిపైగా పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈడీ, సీబీఐ, ఐటీలాంటి సంస్థలను దుర్వినియోగం చేయడంపై చర్చించాలని పట్టుపట్టారు.
తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. భారత్-చైనా సరిహద్దులో ఏం జరుగుతున్నదో కేంద్రం చెప్పడం లేదని, దీనిపైనా చర్చించాల్సిందేనని అఖిలపక్ష సభ్యులు సూచించారు. ఒక్కరోజులో ఎన్నికల కమిషన్‌ను ఎలా నియమించారో అన్న విషయం కూడా చర్చకు రావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, ప్రహ్లాద్‌జోషి స్పందిస్తూ పార్లమెంట్ నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంటామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 23 రోజులపాటు కొనసాగి ఈ నెల 29న ముగియనున్నాయి.
మళ్లీ తెరపైకి మహిళా రిజర్వేషన్ బిల్లు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. గతంలో వ్యతిరేకించిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

