బెంగళూరు, జూలై 24: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై మంత్రి కేజే జార్జిపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశించింది.
రూ. 1,200 కోట్ల కాంట్రాక్టును అప్పగించడంలో అధికారులు నిజాయితీగా వ్యవహరించలేదని బీజేపీ ఎమ్మెల్యేలు సీఎన్ అశ్వథ్ నారాయణ, ధీరజ్ మునిరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.