న్యూఢిల్లీ, మే 11: ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల రాజీనామా, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకునే అంశాలపై మే నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటానని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కుల్దీప్ సింగ్ పతానియా శనివారం తెలిపారు. ఎమ్మెల్యేల వైఖరిని గమనిస్తే వారు తీవ్ర వత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతున్నదని, దీంతో దీనిపై విచారణకు ఆదేశించామని, వారి నుంచి వివరణ కోరామని ఆయన చెప్పారు.
కాగా, ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. తర్వాత శాసన సభ్వత్వాలకు పదవికి రాజీనామా చేసి, అది స్పీకర్ ఆమోదం పొందకుండానే మార్చి 22న బీజేపీలో చేరారు. రాజీనామా ఆమోదం పొందకుండా పార్టీ మారడాన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం అనుమతించదు. ఈ నిబంధన ఆధారంగా వారిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.