లక్నో, జూన్ 15: ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో చేపట్టిన తొలి మోడల్ రాకెట్ లాంచింగ్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. శనివారం ఏఎస్ఐ (ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా) చేపట్టిన ఈ ప్రయోగంలో మోడల్ రాకెట్ భూమి నుంచి 1.12 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఈ ప్రయోగంపై ఇస్రో సైంటిస్ట్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, ‘శనివారం సాయంత్రం 5.14 గంటలకు ప్రయోగించిన రాకెట్లో ఓ చిన్నపాటి శాటిలైట్ కూడా ఉంది.
ప్రయోగంలో రాకెట్ నుంచి బయటకు వచ్చిన శాటిలైట్, పారాచూట్ సాయంతో రాకెట్ ప్రయోగ కేంద్రానికి 400 మీటర్ల దూరంలో దిగింది. అలాగే 15 కిలోల రాకెట్ కూడా సురక్షితంగా భూమీ మీదకు చేరుకుంది’ అని అన్నారు.