అసలు లక్ష.. వడ్డీ రూ.73 లక్షలు!.. అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు
వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఆ రైతు రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఇద్దరు వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి ఆవులు కొన్నాడు. అయితే వడ్డీ వ్యాపారులు రోజుకు రూ.10 వేల చొప్పున వడ్డీ వేయడంతో అది కాస్తా రూ.74 లక్షలకు చేరుకుంది.
- రోజుకు రూ.10 వేల చొప్పున వడ్డీ
- రైతును పీక్కుతిన్న వ్యాపారులు
- గత్యంతరం లేక కిడ్నీ అమ్ముకున్న మహారాష్ట్ర కర్షకుడు
- వ్యాపారులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ముంబై: వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఆ రైతు (Farmer) రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఇద్దరు వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి ఆవులు కొన్నాడు. అయితే వడ్డీ వ్యాపారులు రోజుకు రూ.10 వేల చొప్పున వడ్డీ వేయడంతో అది కాస్తా రూ.74 లక్షలకు చేరుకుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పు తీర్చేందుకు ఆయన కాంబోడియాకు వెళ్లి కిడ్నీ అమ్ముకున్నాడు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో (Maharashtra) ఈ ఘటన చోటుచేసుకుంది. చందాపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతుకు వ్యవసాయంలో వరుస నష్టాలు వచ్చాయి. దీంతో పాల వ్యాపారం మొదలుపెడదామనుకున్నాడు.
ఇద్దరు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.లక్ష అప్పు తీసుకుని ఆవులు కొన్నాడు. అయితే వ్యాపారం పుంజుకోకముందే ఆవులు మరణించాయి. మరోవైపు పంటలు ఫెయిల్ అయ్యాయి. దీంతో మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. ఇచ్చిన అప్పు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు కుడేని వేధించారు. భారీగా వడ్డీ విధించారు. దీంతో పొలాన్ని, ట్రాక్టర్ని, ఇంట్లోని విలువైన వస్తువులను రైతు అమ్మేశాడు. అయినా అప్పు తీరలేదు. రుణం రికవరీ చేసుకునేందుకు వీరు ఆ రైతును లక్ష్మణ్ ఉర్కునే అనే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లగా, ఆయన రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకుని 20 రోజులకు ఏకంగా 40 శాతం వడ్డీ వసూలు చేశాడు.
అయినా అప్పు తీరకపోవడంతో ఆ వ్యాపారులు కిడ్నీ అమ్మాలని కుడేకి సలహా ఇచ్చారు. ఏజెంట్ ద్వారా కోల్కతాకు వెళ్లి పరీక్షలు నిర్వహించుకుని అక్కడ నుంచి కాంబోడియా వెళ్లిన కుడే కిడ్నీ అమ్ముకున్నందుకు రూ.8 లక్షలు పొందాడు. వడ్డీ కోసం తనను జలగల్లా పీల్చిన వ్యాపారులపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే తాను, తన కుటుంబం ముంబైలోని మంత్రాలయ ఎదుట ఆత్మాహుతి చేసుకుంటామని కుడే హెచ్చరించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dairy business
- farmer
- interest
- loan
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

