ఉపాధి కూలీల కన్నెర్ర
- యాప్, కొత్త సర్క్యూలర్‌పై నిరసనల వెల్లువ
- పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్
- దేశ రాజధానిలో 3 రోజులుగా 500 మంది ధర్నా
- కదిలివచ్చిన 15 రాష్ర్టాల ఉపాధి హామీ కూలీలు
న్యూఢిల్లీ, ఆగస్టు 5: రెక్కాడితే డొక్కాడని ఎంతోమంది పేదలకు ఉపాధి హామీ పథకం వరం లాంటిది. పని లేక పస్తులున్న కోట్ల మంది ఈ పథకంతో కాస్త కుదుటపడ్డారు. కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. పేదల ‘ఉపాధి’పై కక్ష కట్టింది. వారి నోటి కాడి బుక్కను లాక్కొంటున్నది. సాఫ్ట్వేర్ మార్పులు, బడ్జెట్లో కోతలు, రెండు పూటలా పనిచేయటం, వేసవి అలవెన్సుల రద్దు వంటి చర్యలతో పేదల కడుపుపై కొడుతున్నది.
దీంతో కడుపు మండిన ఉపాధి కూలీలు ఢిల్లీలో నిరసన గళమెత్తారు. దాదాపు 15 రాష్ర్టాల నుంచి తరలివచ్చిన 500 మంది ఉపాధి కూలీల ప్రతినిధులు.. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎమ్ఎమ్ఎస్) యాప్, కొత్త సర్క్యూలర్‌ను తొలగించాలని మూడు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే ఉపాధి పని కల్పించాలని అంటున్నారు.
అసలు సమస్య ఇదీ..
ఉపాధి హామీ పథకం తప్పుదారి పట్టకుండా ఉండేందుకు గత ఏడాది మేలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎమ్ఎమ్ఎస్ యాప్‌ను తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా పని ప్రదేశాల్లో కూలీల హాజరును రెండు పూటలా నమోదును కచ్చితం చేసింది. దాని కోసం కూలీలు పనికి వచ్చాక (ఉదయం 11 గంటల్లోపు), పని అయిపోయాక (మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య) సెల్ఫీ దిగాలి.
కానీ, చాలా సందర్భాల్లో ఈ యాప్ పనిచేయటం లేదని విమర్శలు ఉన్నాయి. ఒకటి.. పని ప్రదేశాల్లో ఇంటర్నెట్ లేకపోవటం, రెండోది.. ఇంటర్నెట్ ఉన్నా యాప్ ఓపెన్ కాకపోవటం. దానివల్ల కూలీల హాజరు నమోదు కావటం లేదు. ఫలితంగా వారికి కూలీ డబ్బులు రావటం లేదు.
కూలీల డిమాండ్లు ఇవీ
- వెంటనే యాప్ ఆధారిత అటెండెన్స్‌ను తొలగించాలి. పాత పద్ధతిలోనే అటెండెన్స్‌ను నమోదు చేయాలి.
- పని చేశాక 15 రోజుల్లోగా కూలీ డబ్బులు అకౌంట్లో జమ చేయాలి.
- పని ప్రదేశాల్లో కూలీలు ప్రమాదానికి గురైనా, మృతిచెందినా పరిహారం అందజేయటం లేదు. దీన్ని కచ్చితంగా అమలు చేయాలి.
- పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులను 9విడుదల చేయాలి.
- పనిచేసే సమయం ఆధారంగా కాకుండా, చేసిన పనిని బట్టి కూలీ ఇవ్వాలి.
- ఎన్ఎంఎంఎస్ యాప్ ఉపాధి కార్మికుల హక్కులను హరిస్తున్నది. హాజరు నమోదుచేసేందుకు యాప్ కొన్ని సార్లు పనిచేయడం లేదు. దీంతో పూర్తి వేతనం అందుతుందో లేదో అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
శ్యామ్, అసంఘిత్ మజ్దూర్ యూనియన్, రాజస్థాన్

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

