అస్సాం సీఎం హిమంతకు ఈసీ నోటీసు
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ గురువారం స్పందించింది. ఛత్తీస్‌గఢ్ మంత్రి మహమ్మద్ అక్బర్‌ను ఉద్దేశించి శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఈసీని కోరింది.
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ గురువారం స్పందించింది. ఛత్తీస్‌గఢ్ మంత్రి మహమ్మద్ అక్బర్‌ను ఉద్దేశించి శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. ఈ వ్యాఖ్యలపై ఈ నెల 30 సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని శర్మను ఈసీ ఆదేశించింది. కాంగ్రెస్ ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, కవర్ధలో ఈ నెల 18న జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో శర్మ మాట్లాడుతూ, అక్బర్‌ను పంపించేయకపోతే శ్రీరాముని తల్లి కౌసల్య పుట్టిన గడ్డ అపవిత్రమవుతుందన్నారు.
ప్రియాంక గాంధీకి కూడా..
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈసీ గురువారం నోటీసు ఇచ్చింది. రాజస్థాన్‌లోని దౌసాలో ఈ నెల 20న జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రియాంక దౌసా సభలో మాట్లాడుతూ, మోదీ ఓ దేవాలయానికి ఎన్వలప్లో విరాళం ఇచ్చారని చెప్పారు. దాన్ని తెరిచి చూస్తే రూ.21 ఉన్నట్లు తాను టీవీలో చూశానని చెప్పారు. బీజేపీ ప్రజలకు ఎన్వలప్‌లను చూపిస్తుందని, అయితే వాటిలో ఏమీ ఉండదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

