న్యూఢిల్లీ: బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో ఓటర్ జాబితా సవరణ వచ్చే నెల నుంచి మొదలవుతుందని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) కోసం చేపట్టాల్సిన ఇంటింటి సర్వే కోసం తమ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. బీహార్‌లో ఓటర్ జాబితా సవరణపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ప్రక్రియ చేపట్టే అధికారం ఈసీకి ఉందని తీర్పు చెప్పింది.
దీంతో దేశవ్యాప్తంగా సవరణ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ఈసీలు చివరిసారి సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం ప్రచురించిన జాబితాను వెబ్సైట్లోఅందుబాటులో ఉంచుతున్నారు. కాగా, బీహార్ ఓటర్ల జాబితాలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన అక్రమ వలసదారుల పేర్లు పెద్ద ఎత్తున ఉన్నట్టు తేలింది.