న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియను చేపట్టే ప్రత్యేక అధికారం తమకు ఉందని ఈసీ తెలిపింది.
సర్‌పై నిరంతరం ఆదేశాలు ఇవ్వడం తమ అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందని పేర్కొంది. ప్రతి ఎన్నికలకు ముందు అక్కడ ఉన్న ఓటర్ల జాబితాలను నవీకరించడం, సవరించడం తమ బాధ్యత అని, అందుకే బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ సర్‌ను చేపట్టినట్టు తెలిపింది. ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడుకోవడం తమ బాధ్యత అని, దానినిచిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నామని సుప్రీంకు స్పష్టం చేసింది.