హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): డ్రగ్-రెసిస్టెంట్ క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ కోసం ఆధునిక డయాగ్నొస్టిక్ కిట్ల తయారీలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. క్షయ వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందించడం ద్వారా రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. మంగళవారం శాసనసభ కమిటీ హాల్లో హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో తయారైన డ్రగ్-రెసిస్టెంట్ క్షయ వ్యాధి డయాగ్నొస్టిక్ కిట్లను మంత్రి ఆవిషరించారు. ఫ్రెంచ్ డయాగ్నొటిక్స్ దిగ్గజం బయోమెరియో ఈ కిట్ల ఉత్పత్తిని ప్రారంభించింది. బెంగళూరులోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయ కాన్సుల్ జనరల్ మార్ లామీ, ఆరోగ్య-సామాజిక వ్యవహారాల కౌన్సిలర్ చార్ల్స్ మహీ, బయోమెరియో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెగ్జాండర్ మెరియో ఈ ఆవిషరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీబీ వ్యాధి నిర్మూలన దిశగా దేశం చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తున్న బయోమెరియో యాజమాన్యాన్ని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ప్రశంసించారు. కాగా, 1963లో స్థాపించిన బయోమెరియో ఇన్-విట్రో.. డయాగ్నొస్టిక్ రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందింది. సుమారు 4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.37 వేల కోట్లు) వార్షిక టర్నోవర్‌తో, 160 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. అంటువ్యాధులు, క్యాన్సర్, ఇండస్ట్రియల్ మైక్రో బయాలజీ రంగాల్లో వినూత్న డయాగ్నొస్టిక్ పరిషారాలను అందిస్తున్నది. జినోమ్ వ్యాలీలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ కోసం బయోమెరియో మొదటి దశలో రూ.50 కోట్లు ఖర్చు చేసింది. త్వరలో ఇకడ పరిశోధన, అభివృద్ధి ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ సర్వేశ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే ఈ సందర్భంగా ఇండో-ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ రూపొందించిన రెండు దేశాల వాణిజ్య సంబంధాల నివేదికను కాన్సుల్ జనరల్ లామీ.. మంత్రి శ్రీధర్ బాబుకు అందజేశారు. రాష్ర్టాభివృద్ధిలో ఫ్రెంచ్ సంస్థల భాగస్వామ్యాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.