న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటి గంజాయి ఔషధ ప్రాజెక్ట్ జమ్ములో మొదలైంది. సీఎస్ఐఆర్-ఐఐఐఎం జమ్ము, కెనడాకు చెందిన మరో సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టాయి.
మధుమేహం, నరాల సంబంధిత ఆరోగ్య సమస్యల్లో నాణ్యమైన ఔషధాల్ని తయారు చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఇక్కడ తయారైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. చాతాకు సమీపంలో గంజాయి మొక్కల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు జారీచేసింది.