లక్నో, జనవరి 28: హెలికాప్టర్ ప్రయాణానికి తనకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ అడ్డుకొన్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అఖిలేశ్ శుక్రవారం ఆరెల్డీ నేత జయంత్ చౌదరితో కలిసి యూపీలోని ముజఫర్నగర్లో విలేకరుల సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. వీరు ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉండగా, హెలికాప్టర్ ఎగరడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై అఖిలేశ్ అసహనం వ్యక్తం చేశారు. ‘కారణాలేమీ చెప్పకుండా ఆపేశారు. నా ముందే బీజేపీ నేత ఒకరు హెలికాప్టర్లో వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. యూపీలో బీజేపీకి ఓటమి తప్పదని, అది ఆ పార్టీకి కూడా అర్థం అయిందని, అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతన్నదని ఆరోపించారు. అయితే, తర్వాత హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అనుమతి ఇచ్చినట్టు అఖిలేశ్ మరో ట్వీట్ చేశారు.