న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలను చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది. సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ విజ్ఞప్తిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని రాహుల్ తమకు తెలిపారన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలకు సీడబ్ల్యూసీ కృతజ్ఞతలు తెలిపింది.