బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనానికి మరో ధరల వాత పెట్టింది. సర్‌చార్జి, ఫిక్స్డ్ చార్జి, యూనిట్ చార్జి అంటూ రకరకాల జిమ్మిక్కులతో మొత్తం మీద విద్యుత్తు బిల్లు మీద నెలకు అదనంగా 7 శాతం వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. కర్ణాటక విద్యుత్తు నియంత్రణ కమిషన్ (కేఈఆర్సీ) విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, గృహ, పారిశ్రామిక వినియోగదారులకు ప్రతి యూనిట్‌కు విద్యుత్తు చార్జిని తగ్గించారు. అయితే, ఫిక్స్డ్ చార్జి రూ.25 పెరిగింది.
రిటెయిల్ పవర్ టారిఫ్‌ను 7 శాతం పెంచాలని విద్యుత్ కంపెనీలుకోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 3 కేడబ్ల్యూతో నెలకు 250 యూనిట్ల విద్యుత్తును వినియోగించే గృహ వినియోగదారులు మార్చి 31 వరకు రూ.1,900 చెల్లిస్తే, ఏప్రిల్ 1 నుంచి రూ.90 సర్‌చార్జితో రూ.2,000కు పైగా చెల్లించాల్సి ఉంటుంది.