న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: సివిల్ సర్వీసెస్ పరీక్ష(సీఎస్ఈ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) పరీక్ష, 2026 కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులై, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా 933 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది. ప్రిలిమినరీ పరీక్ష 2026 మే 24న జరుగుతుంది. మెయిన్ పరీక్ష 2026 ఆగస్టు 21న ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ పేర్కొన్నది.