కొలీజియం చర్చల్ని బహిరంగపర్చలేం
కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న విమర్శల్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ కొట్టిపారేశారు. న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చర్చల్ని బహిరంగ పర్చలేమని, నియామక ప్రక్రియను రికార్డు చేయటం, డాక్యుమెంటేషన్ చేయటమనేది భారత రాజ్యాంగంలో లేదని ఆయన అన్నారు.
- జడ్జీల నియామకాలపై సీజేఐ డీవై చంద్రచూడ్
- రాజ్యాంగం, చట్ట ప్రకారమే ఆర్టికల్ 370 రద్దు
న్యూఢిల్లీ, జనవరి 1: కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న విమర్శల్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ కొట్టిపారేశారు. న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చర్చల్ని బహిరంగ పర్చలేమని, నియామక ప్రక్రియను రికార్డు చేయటం, డాక్యుమెంటేషన్ చేయటమనేది భారత రాజ్యాంగంలో లేదని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, స్వలింగ సంపర్కుల వివాహం.. తదితర అంశాలపై పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు విశ్వసనీయతను కొనసాగిస్తున్నామని, న్యాయవాదుల అభిప్రాయం మేరకు కేసుల కేటాయింపు ఉండదని సీజేఐ స్పష్టం చేశారు. ‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న విమర్శ సరైంది కాదు. అత్యంత పారదర్శకంగా కొలీజియంను నిర్వహిస్తున్నాం’ అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేసులో రాజ్యాంగం, చట్టం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని అన్నారు.
రాజ్యాంగం ప్రకారం వెళ్లాలి..
సుప్రీంకోర్టు తీర్పులు విమర్శలకు దారితీయటంపై సీజేఐ మాట్లాడుతూ, ‘భారత రాజ్యాంగం, చట్ట ప్రకారం విచారణ జరిపామా? తీర్పు ఉందా? అన్నదే చూడాలి. అంతే తప్ప.. విమర్శలను దృష్టిలో పెట్టుకొని విచారణ చేపట్టడమనేది సరైన విధానం కాదు. వాటికి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. తీర్పు ఎందుకు అలా వచ్చిందన్న కారణం జడ్జిమెంట్‌లో ఉంటుంది’ అని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహం కేసును ప్రస్తావిస్తూ, ‘ఒక కేసులో వెలువడే అంతిమ తీర్పు జడ్జిపై వ్యక్తిగత ప్రభావం ఉండరాదు. అంతిమ ఫలితంపై విచారించాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

