న్యూఢిల్లీ: ఈడీ 11 ఏండ్ల 7 నెలల్లో దాఖలు చేసిన కేసుల సంఖ్య 6,312 కాగా, రుజువైనవి 120 మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలిపింది. అంటే, 0.01 శాతం కేసులు రుజువైనట్లు పేర్కొంది.
ఈడీ 93 కేసుల్లో క్లోజర్ రిపోర్ట్‌లను సంబంధిత ప్రత్యేక న్యాయస్థానాలకు సమర్పించినట్లు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలను తెలిపారు.