దేశంలో ఎల్పీజీ సంక్షోభం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఎల్పీజీ సిలిండర్ల కొరత స్థానికులను తీవ్రంగా వేధిస్తున్నది.
దీంతో వాళ్లు రాత్రి వేళల్లో కూడా గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూల పక్కనే ఖాళీ సిలిండర్లను ఉంచి నిద్రపోతున్నారు. కొందరు తాము రోజుల తరబడి క్యూలో ఉన్నా ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ లభించడం లేదని వాపోయారు.