సర్ సాకులు
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా ప్రక్రియ వల్ల గ్రేటర్ వ్యాప్తంగా పాలన పడకేసింది. సర్ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ అధికారిక విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్ ప్రక్రియలో బిజీగా ఉన్నామంటూ పాలనా పరమైన పనులను పక్కకు పెడుతున్నారని నగర ప్రజలు వాపోతున్నారు.
- ఏ పనికి వెళ్లినా.. సర్లో బిజీ అంటున్న ఉద్యోగులు
- ఆగస్టు 3 తర్వాతే రావాలంటూ వెనక్కి పంపుతున్న అధికారులు
- రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో నిలిచిన పౌర సేవలు
సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా ప్రక్రియ వల్ల గ్రేటర్ వ్యాప్తంగా పాలన పడకేసింది. సర్ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ అధికారిక విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్ ప్రక్రియలో బిజీగా ఉన్నామంటూ పాలనా పరమైన పనులను పక్కకు పెడుతున్నారని నగర ప్రజలు వాపోతున్నారు. సర్ విధుల్లో ముఖ్యంగా మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత స్థాయి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్థాయి దాకా అన్నిరకాల ఉద్యోగులు ఈ ప్రక్రియలో భాగమయ్యారు. దీంతో నగర ప్రజలు తమ పనుల కోసం వెళ్తే ఏ అధికారి కూడా అందుబాటులో ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఏ పనుల కోసం వెళ్తున్నా ఆగస్టు 3 దాకా సర్ నమోదు ప్రక్రియ సాగుతుందని, ఆ పనుల్లో బిజీగా ఉన్నామని ఆ తర్వాతే రావాలని పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో బాధితులు వెనుదిగిరి పోతున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం మాత్రం రోజువారీ పాలనాపరమైన విధులతో పాటు సర్ ప్రక్రియను కొనసాగించాలని చెప్తున్నారు. అధికారులు మాత్రం ఇదే అదనుగా సర్ ప్రక్రియలో బిజీగా ఉన్నామని విధులను తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పూర్తిస్థాయిలో సర్ విధుల్లోనే ఉండాలని అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు జిల్లా అధికారులే నేరుగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండటం లేదు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఆహారం పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
మందకొడిగానే సర్ ప్రక్రియ
ప్రభుత్వ అధికారులు సర్ విధుల్లో బిజీగా ఉన్నామని చెప్తున్నా.. ఓటర్ల వివరాల నమోదు, డిజిటలీకరణ మాత్రం మందకొడిగానే సాగుతున్నది. అధికారులు పూర్తిస్థాయిలో సర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని చెప్తున్నా గ్రేటర్ పరిధిలో ఇప్పటిదాకా డిజిటలైజేషన్ మాత్రం 50 శాతం దాటడం లేదు. అధికారులు లేకపోవడంతో గ్రేటర్ వ్యాప్తంగా మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. సర్ పేరిట అసలు కార్యాలయాలకు రావడమే మానేశారనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో అటు పౌర సేవలను నిర్లక్ష్యం చేస్తూ.. ఇటు సర్ ప్రక్రియ వేగవంతం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 50.73 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి 54.89 శాతం, రంగారెడ్డి జిల్లాలో 59.21 శాతం మాత్రమే డిజిటలీకరణ పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారులేమో పూర్తిస్థాయిలో సర్పై దృష్టిసారించామని చెప్తుంటే గ్రేటర్ పరిధిలో ఇప్పటిదాకా 60 శాతం కూడా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాకపోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్ విధులతో పాటు అధికారిక విధులపై కూడా ఉద్యోగులు దృష్టిసారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

