నేషనల్ ర్యాంకింగ్స్‌లో వెనుకంజ?
రాష్ట్రంలో పౌరులకు అన్నిసేవలు సకాలంలో అందించేక్రమంలో కొన్ని విభాగాల్లో తెలంగాణ పోలీసులు వెనుకబడ్డారా? జాతీయస్థాయిలో మనవారి ప్రదర్శన మందగించిందా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. దీంతో ఏయే విభాగాల్లో తెలంగాణ పోలీసులు వెనుకబడ్డారో తెలుసుకొని.. ఆయా అంశాల్లో చిత్తశుద్ధితో పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించినట్టు తెలిసింది.
- స్థానాల్లో తెలంగాణ పోలీసుల పేలవ ప్రదర్శన
- సైబర్ సెక్యూరిటీ ప్రమాణాల్లో 15వ స్థానం
- సోషల్ మీడియా పనితీరులో 16వ స్థానం
- సైబర్ నేరాల మనీ రిస్టోరేషన్‌లో 18వ స్థానం
- పనితీరును మెరుగు పర్చుకోవాలన్న డీజీపీ ఆనంద్
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పౌరులకు అన్నిసేవలు సకాలంలో అందించేక్రమంలో కొన్ని విభాగాల్లో తెలంగాణ పోలీసులు వెనుకబడ్డారా? జాతీయస్థాయిలో మనవారి ప్రదర్శన మందగించిందా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. దీంతో ఏయే విభాగాల్లో తెలంగాణ పోలీసులు వెనుకబడ్డారో తెలుసుకొని.. ఆయా అంశాల్లో చిత్తశుద్ధితో పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించినట్టు తెలిసింది. శుక్రవారం నిర్వహించిన అన్ని యూనిట్ల వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ ఆయా విభాగాల్లో మెరుగైన పనితీరు కోసం సూచనలు చేయడంతో పాటు.. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
త్వరలో ప్రకటించబోయే జాతీయ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం సాధించాలంటే ప్రజలకు పోలీసింగ్ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందజేయాలని ఆయన వ్యవస్థను అప్రమత్తం చేశారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నది. ఇక్కడ్నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేస్తున్న సొమ్ము కోట్లలో ఉంటే.. దానిని రికవరీ చేయడంలో పోలీసులు వెనుకబడ్డారు. మనీ రిస్టోరేషన్‌లో తెలంగాణ 46.6 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. నేరాల నమోదులో, అత్యధికంగా నష్టపోతున్న కేటగిరీల్లో మొదటిస్థానాల్లో ఉంటూ.. రికవరీలో మాత్రం 18వ స్థానంలో ఉండటంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
‘సైబర్’ ప్రమాణాల్లోనూ వెనుకంజ
సైబర్ సెక్యూరిటీ ప్రమాణాల్లోనూ 15వ స్థానంతో తెలంగాణ పోలీసులు వెనుకంజలో ఉన్నారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు, వ్యాలెట్లు, టెలికాం కంపెనీలతో పోలీసులను అనుసంధానించే అంతర్గత డిజిటల్ వేదికైన సహయోగ్ పోర్టల్ నిర్వహణలోనూ తెలంగాణ 16వ స్థానంలో ఉన్నది.
తగ్గిపోతున్న ఈ-జీరో ఎఫ్ఐఆర్లు
తెలంగాణలో ఈ-జీరో ఎఫ్ఐఆర్ల నమోదు క్రమంగా తగ్గుతున్నట్టు తెలుస్తున్నది. నేరం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగినా డిజిటల్ వేదిక ద్వారా లేదా సమీప పోలీస్ స్టేషన్లో నమోదు చేసే ఎఫ్ఐఆరే ఈ-జీరో ఎఫ్ఐఆర్. దీని ద్వారా బాధితులు ‘ఏరియా సరిహద్దుల’ పేరుతో పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగాల్సిన అవసరం తప్పుతుంది. సంబంధిత స్టేషన్‌కు ఆ కేసు బదిలీ అవుతుంది. నేరం జరిగిన వెంటనే ఆధారాలు సేకరించడానికి తగిన సమయం దొరుకుతుంది. ఈ తరహా వ్యవస్థలో తెలంగాణ 13వ స్థానంలో ఉండటం కలవరపెట్టే అంశంగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు, వేధింపులు, ఆన్లైన్ నేరాల పర్యవేక్షణలో రాష్ట్రం 16వ స్థానంలో నిలిచింది. చట్టాలు, సైబర్ నేరాల దర్యాప్తులో శిక్షణ ఇచ్చే కెపాసిటీ బిల్డింగ్ విభాగంలో తెలంగాణ 8వ స్థానంలో ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

