ప్రజాస్వామ్య విజయం
జెన్‌జీ ఉద్యమానికి తలవంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. కాక్రోచ్ల రూపంలోని విద్యార్థులు, యువత పోరాటాన్ని చూసి దేశం గర్విస్తున్నదని..హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పారు.
- ధర్మేంద్ర రాజీనామా
- విద్యార్థులను చూసి దేశం గర్విస్తున్నది
- ఇప్పటికైనా ప్రభుత్వాలు కండ్లు తెరవాలి
- యువత ఆకాంక్షలను గుర్తించాలి
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 25 (నమస్తేతెలంగాణ): జెన్‌జీ ఉద్యమానికి తలవంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. కాక్రోచ్ల రూపంలోని విద్యార్థులు, యువత పోరాటాన్ని చూసి దేశం గర్విస్తున్నదని..హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పారు. తరం మారిందని, విద్యార్థిలోకం మేలుకొన్నదని.. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ మెంబర్ కే కిశోర్గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. చాలాసార్లు రాజకీయ పార్టీల ఉద్యమాన్ని చూశామని, కానీ గత నెల రోజుల నుంచి విద్యార్థి ఉద్యమం దేశాన్ని తట్టిలేపిందన్నారు. వారిపై దేశద్రోహులుగా ముద్రవేసినా, ఉగ్రవాదులన్నా, విదేశీయుల హస్తమున్నదని ఆరోపణలు చేసినా చివరకు కేంద్రం దిగిరాక తప్పలేదని వ్యాఖ్యానించారు.
న్యాయానికే బీఆర్ఎస్ అండ..
విద్యార్థుల పోరాటంలో న్యాయమున్నదనే వారికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని చెప్పారు. మొన్న కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి ఇందిరాపార్క్ దగ్గర నిరసనకు ఉపక్రమించారని గుర్తుచేశారు. యువత సైతం స్వచ్ఛందంగా తరలివచ్చిందన్నా రు. మాకు ప్రశ్నించే హక్కు ఉన్నదని..అవసరమైతే ప్రభుత్వాలను గద్దెదిం చుతామని గర్జించిన తీరు చూశామన్నారు. కాక్రోచ్ల పోరాటాన్ని పాల కులు గుణపాఠంగా తీసుకొని ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హితవుపలికారు.
రాజ కీయ పార్టీ లు సైతం యువతకు హామీలిచ్చేటప్పుడు కూడా ఆచీ తూచి వ్యవహరించాలని సూచించారు. లేదంటే హామీల ఏజెండా ఆధారంగా ప్రభుత్వాలను గద్దె దింపే సత్తా వి ద్యార్థులకు ఉంటదనే విషయం ప్రస్తుత పరిణామాలతో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. ‘ఏ పార్టీ అండలేకున్నా.. కాక్రోచ్ల పేరిట పార్టీని ఏ ర్పాటు చేసుకొని సోషల్ మీడియా అండతో ఉద్యమించిన తీరును ‘నా 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొదటిసారిగా చూశాను..’అని ఉద్ఘాటించారు.
విద్యార్థుల దెబ్బకు పార్లమెంట్ గేట్లు మూసు కోవాల్సివ చ్చిందని, ఢిల్లీ మెట్రో ఐదు రోజులు బంద్ పెట్టాల్సివచ్చిందన్నారు. ఢిల్లీకి వచ్చే రహదా రులన్నీ బంద్పెట్టిన, కేంద్ర బలగాలు చుట్టుముట్టినా పోరాటాన్ని కొనసాగించిన తీరును చూసి దేశమే ఆశ్చర్యపోయిందని చెప్పారు. కేంద్రం అతిగా వ్యవహరించి వారిని టెర్ర రిస్టులని, వారికి పాకిస్థాన్ నుంచి సాయమందుతుందని నిందించినా వెన్నుచూపకుండా ఇంక్విలాబ్..ఈ దేశం మాదని నినదించి దేశపౌరులందరిని కదిలించారని గుర్తుచేశారు. అసమాన పోరాటంతో కేంద్రం మెడలు వంచిన ఘనత జన్జీకే దక్కిందని ప్రశంసించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

