కేంద్రం అప్పులు రూ.155.6 లక్షల కోట్లు
రాష్ర్టాలు తీసుకునే రుణాలపై సవాలక్ష కొర్రీలు పెట్టే కేంద్రంలోని మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు చేరాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాష్ర్టాలు తీసుకునే రుణాలపై సవాలక్ష కొర్రీలు పెట్టే కేంద్రంలోని మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు చేరాయి. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 57.1 శాతానికి సమానమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం పార్లమెంట్లో ప్రకటించారు. నిరుడు ఇదే సమయానికి కేంద్ర ప్రభుత్వ అప్పులు జీడీపీలో 61.5 శాతంగా ఉన్నట్టు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు జీడీపీలో దాదాపు 28 శాతంగా ఉన్నట్టు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో జీఎఫ్‌సీఎఫ్ (గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్) స్థిర ధరల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.45.41 లక్షల కోట్లుగా ఉన్నాయని, ప్రాథమిక అంచనాల ప్రకారం ఇవి గత ఆర్థిక సంవత్సరంలో రూ.54.35 లక్షల కోట్లకు పెరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

