Diabetes Medications | న్యూఢిల్లీ, మే 16: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదన్న వార్తల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతోపాటు మధుమేహం, హృద్రో గ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఆరు మందుల ధరలను తగ్గించింది. యాంటాసిడ్స్, మల్టీవిటమిన్స్, యాంటిబయాటిక్స్ ధరలు దిగిరానున్నాయి. ఈ మేరకు ఫార్మాస్యూటికల్స్ శాఖ, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నోటిషికేషన్ విడుదల చేశాయి.
ఈ ధరల తగ్గింపు సమాచారాన్ని మందుల డీలర్లు, స్టాకిస్ట్లకు తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఆదేశించినట్టు పేర్కొన్నాయి. దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్టు గణా ంకాలు చెబుతున్నాయి. వీరందరికీ ఈ ఔషధాల తగ్గింపు ప్రయోజనం చేకూరుతుంది.