న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉద్యోగ నియామక, ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బాధ్యతలను కేంద్రం తగ్గించింది. వచ్చే ఏడాది ఎన్టీఏ ఎలాంటి నియామక పరీక్షలు నిర్వహించదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం తెలిపారు. ఇక నుంచి ఎన్టీఏ ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు.
వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్-యూజీ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలా లేక ఆఫ్లైన్లో నిర్వహించాలా అన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొన్ని తరగతుల ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ధరలు తగ్గుతాయని, ప్రధాన్ ప్రకటించారు.