DOPT | న్యూఢిల్లీ: సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఉద్యోగులు ఇష్టానుసారం కార్యాలయాలకు వస్తుండడం, సమయానికి ముందే వెళ్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ వ్యక్తిగత, శిక్షణ శాఖ (డీవోపీటీ) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేసింది.
ఇకపై ఉద్యోగులందరూ ఉదయం 9.15 గంటలకే బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేసుకోవాల్సిందేనని, ఆలస్యంగా వచ్చే వారు సగం రోజు సాధారణ సెలవు నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎవరైనా ఉద్యోగి ఏదైనా రోజున విధులకు హాజరుకాలేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయడంతోపాటు క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.