న్యూఢిల్లీ: బైక్ ట్యాక్సీల చట్టబద్ధతపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మోటారుసైకిళ్లు ‘కాంట్రాక్టు క్యారేజ్’ నిబంధనల పరిధిలోకే వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మోటారు వాహనాల చట్టం ప్రకారం ఒక నిర్దిష్టమైన ఒప్పందంతో ఒక వాహనం ప్రయాణికులను తీసుకువెళితే దానిని కాంట్రాక్టు క్యారేజ్ అంటారని, బైక్ టాక్సీలు కూడా ఒక ఒప్పందం ప్రకారమే ప్రజలను తమ గమ్య స్థానాలకు చేరుస్తున్నందున అవి కూడా ‘కాంట్రాక్టు క్యారేజ్’ పరిధిలోకే వస్తాయని తెలిపింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇక నుంచి మోటారు సైకిళ్లను కాంట్రాక్టు క్యారేజ్ వాహనాల క్యాటగిరి కింద పరిగణనలోకి తీసుకుంటారు.