కోల్కతా: విపక్షాలపై కక్షగట్టిన బీజేపీ ఆయా పార్టీల నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూనే ఉన్నది. ఇటీవల తమిళనాడు మంత్రిని అదుపులోకి తీసుకోగా, తాజాగా పశ్చిమబెంగాల్ న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘటక్కు శుక్రవారం ఈడీ సమన్లు జారీ చేసింది.
బొగ్గు కుంభకోణం కేసులో ఈనెల 28న న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. విచారణ జరిపి ఘటక్ పాత్రపై నిర్ధారణకు వస్తామని తెలిపాయి. కుంభకోణంలో అతని హస్తం ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.