సాగు సంక్షోభం.. రుణ ఉచ్చులో రైతు!
దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకున్నది. ఈసారి నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటం, ఎల్ నినో కోరలు చాచడంతో అన్నదాతలు కుదేలయ్యారు. దీంతో రుణ ఉచ్చు నుంచి బయటపడే మార్గాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 2028 మార్చి నాటికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో వ్యవసాయ రంగానికి చెందిన స్థూల మొండి బకాయిలు(జీఎన్‌పీఏ) సుమారు 5.3 శాతం నుంచి 5.6 శాతానికి చేరుకోవచ్చని గురువారం విడుదలైన ఒక నివేదిక పేర్కొంది.
- 2028 మార్చి నాటికి పెరగనున్న వ్యవసాయ మొండి బకాయిలు
- లోటు వర్షపాతంతో బ్యాంకులకు తగ్గనున్న రైతు రుణ చెల్లింపులు
- కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక అంచనా
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకున్నది. ఈసారి నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటం, ఎల్ నినో కోరలు చాచడంతో అన్నదాతలు కుదేలయ్యారు. దీంతో రుణ ఉచ్చు నుంచి బయటపడే మార్గాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో 2028 మార్చి నాటికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో వ్యవసాయ రంగానికి చెందిన స్థూల మొండి బకాయిలు(జీఎన్‌పీఏ) సుమారు 5.3 శాతం నుంచి 5.6 శాతానికి చేరుకోవచ్చని గురువారం విడుదలైన ఒక నివేదిక పేర్కొంది. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం 2026 జూన్ నాటికి వ్యవసాయ జీఎన్‌పీఏ నిష్పత్తి 5.11 శాతంగా ఉంది.
షెడ్యూల్డ్ కామర్స్ బ్యాంకుల(ఎస్సీబీ) రుణాలలో వ్యవసాయ రంగం వాటా 12.9 శాతంగా ఉండగా మొత్తం ఎస్సీబీ జీఎన్పీఏలలో దాని వాటా 37.5 శాతంగా ఉంది. 2026 జూన్ నాటికి రూ.1.41 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగ స్థూల నిరర్థక ఆస్తులు(జీఎన్‌పీఏ) 2027 మార్చి నాటికి రూ.1.47 లక్షల కోట్ల నుంచి రూ.1.53 లక్షల కోట్లకు, అలాగే 2028 మార్చి నాటికి రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. రుతుపవనాల ప్రభావం 2027-28 ఆర్థిక సంవత్సరంలో(ఎఫ్వై28) బ్యాంకుల ఖాతాల్లో కనిపించే అవకాశం ఉంది. బలహీనమైన రుతుపవనాల కారణంగా 2028 మార్చి నాటికి వ్యవసాయ జీఎన్‌పీఏ నిష్పత్తికి 70 నుంచి 80 బేసిస్ పాయింట్లు అదనంగా చేరవచ్చు. 2026 నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 87 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఈ వర్షపాత లోటు ప్రధానంగా బ్యాంకుల వ్యవసాయ రుణాల్లో అధిక వాటా కలిగిన రాష్ర్టాల్లోనే కేంద్రీకృతమై ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

