Commercial Cylinder | న్యూఢిల్లీ: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.33.50 తగ్గింది. ఈ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది అయిదోసారి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1631.50కు చేరుకుంది. మరోవైపు విమానయాన ఇంధన(ఏటీఎఫ్) ధర 2.9 శాతం పెరిగింది. దీంతో కిలోలీటర్ ఇంధనం ధర ఢిల్లీలో రూ.2,677.88 పెరిగి రూ.92, 021.93కి చేరుకుంది. గత నెలలోనూ ఏటీఎఫ్ ధర 7.5 శాతం పెరిగింది. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.