శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఒక చైనీస్ తుపాకి, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెర్రరిస్టును కోటి దోడాకు చెందిన ఫరీద్ అహ్మద్‌గా గుర్తించారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో పోలీసులు దోడా పట్టణం శివార్లలో చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తనిఖీలు చేయగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకువెళుతుండగా అతడు పట్టుబడ్డాడని చెప్పారు. నిందితుడు దోడాలోని పోలీసు సిబ్బందిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యాడని దర్యాప్తులో తేలింది. అతనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.