Telegram | టెలిగ్రామ్ బ్యాన్ అయినా ఇంకా పని చేస్తుందా.. ప్రచారంలో నిజమెంత
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం నిషేధం విధించినా.. ఇంకా ఈ యాప్ పని చేస్తుందని కొందరు టెక్ నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ యాప్ నిషేధం పూర్తిగా సాధ్యం కాకపోవచ్చని వారు చెబుతున్నారు.
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం నిషేధం విధించినా.. ఇంకా ఈ యాప్ పని చేస్తుందని కొందరు టెక్ నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ యాప్ నిషేధం పూర్తిగా సాధ్యం కాకపోవచ్చని వారు చెబుతున్నారు. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. గతంలో పేపర్ లీకేజీని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా టెలిగ్రామ్ యాప్‌ను కేంద్రం నిషేధించింది.
అలాగే, జూన్ 30 వరకు టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా ప్రభుత్వం డిసేబుల్ చేసింది. దీనివల్ల టెలిగ్రామ్ యాప్ ద్వారా పేపర్ లీకేజీ అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఒకపక్క కేంద్రం ఈ యాప్‌ను బ్లాక్ చేసినా ఇంకా ఈ యాప్ పని చేస్తున్నట్లు కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్లేస్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను తొలగించగా, యాపిల్ స్టోర్ నుంచి కూడా తొలగిస్తారు. అయితే, ఇతర థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్, వెబ్, ఏపీకేల ద్వారా టెలిగ్రామ్‌ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అసలు టెలిగ్రామ్ యాప్ డిజైనింగే ఇలాంటి బ్యాన్స్కు దొరకకుండా ఉండేలా రూపొందింది అని టెక్ నిపుణుల అభిప్రాయం. మనదేశంలో ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లెవల్లో బ్లాకింగ్ చేసే వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. ఇటీవల సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లోని లోపాల్ని బయటపెట్టిన 19 ఏళ్ల నిసర్గ అధికారి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించాడు. దేశంలో టెలిగ్రామ్‌ను పూర్తిగా నిషేధించడం సాధ్యం కాకపోవచ్చన్నాడు. ప్రాక్సీలు, ఇతర పద్ధతుల ద్వారా వాడేందుకు అనుగుణంగా ఈ యాప్ తయారైందన్నాడు.
సాధారణంగా ఒక యాప్‌ను బ్లాక్ చేస్తే ఇంటర్నెట్ అందించే సంస్థలైన జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు వాటిని పూర్తిగా తొలగించాలి. ఆ ఇంటర్నెట్ ఉపయోగించి యూజర్లు వాటిని సెర్చ్ చేసినా అవి అందుబాటులో ఉండకూడదు. ఏదైనా ఒక సైట్ సెర్చ్ చేయగానే ఐఎస్పీలు.. డీఎన్ఎస్ (డొమైన్ నేమ్ సిస్టమ్)లోకి వెళ్లి వాటిని అందిస్తాయి. ఐఎస్పీలు వీటిని బ్లాక్ చేస్తే ఆ వెబ్ లేదా యాప్ సర్వర్లోకి కూడా కనెక్ట్ కాకూడదు. కానీ, టెలిగ్రామ్ మాత్రం డీఎన్ఎస్లలోకి దొరకుండా పని చేస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు. ఇలాంటి లోపాలుండటం వల్ల టెలిగ్రామ్ పూర్తిగా నిషేధించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

