బెంగళూరు, జూన్ 21: తప్పుడు వార్తలు పోస్టింగ్ చేసినా, ప్రచారం చేసినా ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఓ చట్టాన్ని తేనున్నది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు ఓ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది.
కర్ణాటక మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ (ప్రొహిబిషన్) చట్టం ముసాయిదాను ఈ వారం ప్రారంభంలో క్యాబినెట్ ముందుంచారు. ఈ చట్టం అమలులోకి వస్తే సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలను అరికట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ఓ మంత్రి నేతృత్వంలో ఆరు సభ్యులతో ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును నెలకొల్పనున్నారు.