Telangana | జీడీపీలో దేశంలోనే తెలంగాణ టాప్.. పెద్ద రాష్ర్టాల్లో మనదే అగ్రస్థానం
అభివృద్ధిలో, సంపద సృష్టిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో అత్యధిక తలసరి ఎన్ఎస్డీపీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.
- తెలంగాణ తలసరి జీడీపీ 3.08 లక్షలు
- జీడీపీ, తలసరి జీడీపీలోనూ టాపే
- ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రత్యేక కథనం
Telangana | న్యూఢిల్లీ, నవంబర్ 19: అభివృద్ధిలో, సంపద సృష్టిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో అత్యధిక తలసరి ఎన్ఎస్డీపీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. రూ.3.08 లక్షలతో టాప్లో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ, తలసరి జీడీపీలోనూ పెద్దపెద్ద రాష్ర్టాలను వెనక్కు నెట్టింది. ఈ వివరాలు వెల్లడించింది ఏదో ఆశామాషీ వ్యక్తులు కాదు.

ప్రపంచం ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్. భారత రాష్ర్టాల జీడీపీ, తలసరి జీడీపీపై ఆ సంస్థ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఏ రాష్ట్ర జీడీపీ ఎంత? తలసరి జీడీపీ ఎంత అనేది స్పష్టంగా పేర్కొంటూ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చిన్నరాష్ర్టాలైన సిక్కిం, గోవా తర్వాతే తెలంగాణ టాప్లో నిలిచింది. ఒక ప్రాంతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు, సేవలను ఆ ప్రాంత జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి జీడీపీ. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

