Tejashwi Yadav | బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) రెండోసారి తండ్రయ్యారు. ఈ విషయాన్ని తేజస్వినే స్వయంగా వెల్లడించారు. తన భార్య రాజశ్రీ యాదవ్ (Rajshree Yadav) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఫొటోను కూడా పంచుకున్నారు.
‘గుడ్ మార్నింగ్.. మా నిరీక్షణ చివరకు ముగిసింది. కుమారుడి రాకను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జై హనుమాన్’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తేజస్వి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు తేజస్వి-రాజశ్రీ 2021 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. వీరికి 2023 మార్చిలో తొలి సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు కాత్యాయిని అని పేరు పెట్టారు. ఇప్పుడు రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడు. వారసుడి రాకతో లాలూ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది.
Good Morning! The wait is finally over!
So grateful, blessed and pleased to announce the arrival of our little boy. Jai Hanuman! pic.twitter.com/iPHkgAkZ2g
— Tejashwi Yadav (@yadavtejashwi) May 27, 2025
Also Read..
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు
BSF | పాక్లో 2.2 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి దాడులు.. భారత్ దెబ్బకు పారిపోయిన పాక్ రేంజర్లు
Bomb Blast | చేతిలోనే పేలిన బాంబు.. దుండగుడు మృతి