BSF | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను త్రివిధ దళాలు సమన్వయంతో ధ్వంసం చేశాయి. కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించి ఉగ్రమూకల పనిపట్టాయి. ఇక ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను మన బలగాలు గత కొన్ని రోజులుగా ఎక్స్ వేదికగా షేర్ చేస్తున్నాయి. తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ శత్రు దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్ (Delivers Powerful Message) ఇస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ వివరాలను వివరిస్తూ.. తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) కూడా ఆ తరహా వీడియోని పంచుకుంది. అందులో మూడు టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసినట్లు చూపించింది. ఈ మేరకు పాక్‌లో 2.2 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు ఖచ్చితమైన దాడులను నిర్వహించారు. పాక్ ఆర్మీ పోస్టులపై కూడా దాడి చేసి ధ్వంసం (India hit Pak army posts) చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను జమ్ము ఫ్రాంటియర్‌లోని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శశాంక్ ఆనంద్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
‘మే 9, 10 తేదీల మధ్య రాత్రి సరిహద్దు సమీపంలో లష్కరే తోయిబాకు చెందిన లూని ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ను నాశనం చేశాం. ఆర్ఎస్ పురా సెక్టార్‌కు ఎదురుగా ఉన్న మస్త్‌పూర్ అనే మరో లాంచ్‌ప్యాడ్‌ను కూడా ధ్వంసం చేశాం. భారత దళాల దాడులతో పాక్ రేంజర్లు అక్కడి నుంచి పారిపోయారు (Rangers fleeing)’ అని జమ్ము ఫ్రాంటియర్‌లోని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శశాంక్ ఆనంద్ అన్నారు. ‘సరిహద్దుల్లో మన భద్రతా దళాలు పూర్తి ఆధిపత్యం చెలాయించాయి. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి’ అని పేర్కొన్నారు.
BSF releases visuals of Operation Sindoor.
BSF unleash fury on Pakistan post Putwal, Chaprar, Chota Chak after unprovoked attack. Pakistani Rangers seen fleeing as BSF’s might is on full display.
#OperationSindoor #BSF pic.twitter.com/Hn66DRblrl
— Manish Shukla (@manishmedia) May 27, 2025
Also Read..
Bomb Blast | చేతిలోనే పేలిన బాంబు.. దుండగుడు మృతి
IBM Layoffs | ఏఐ ఎఫెక్ట్‌తో ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!
Corona Virus | దేశంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు