Loksabha Elections 2024 : హస్తిన వేదికగా పాలక ఎన్డీయే, విపక్ష ఇండియా కూటముల మధ్య పవర్ వార్‌కు తెరలేచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి సొంతంగా లభించకపోవడంతో విపక్ష ఇండియా కూటమిలోనూ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ఆశలు చిగురించాయి.
ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా భాగస్వామ్య పార్టీల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరవుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్ ముగియడం మనం తొలిసారి చూశామని చెప్పారు.
మెజారిటీ మార్క్‌కు మోదీ చాలా దూరంలో నిలిచారని అన్నారు. ఆయన ఇక తన ఇద్దరు సహచరులతో ప్రభుత్వాన్ని నడపలేరని వ్యాఖ్యానించారు. ఎన్డీయేకు సంఖ్యాబలం ఉన్నా బిహార్ ప్రయోజనాలను పరిరక్షించే ప్రభుత్వం ఏర్పాటు కావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. నితీష్ కుమార్ కింగ్‌మేకర్ అయితే ఆయనకు ఇది సరైన అవకాశమని, బిహార్‌కు ప్రత్యేక హోదా లభించేలా, దేశమంతటా కుల గణన నిర్వహించేలా ఆయన చొరవ చూపాలని కోరారు.
Read More :
MLC counting | కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..