Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని నాశనం చేశారని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ధరల భారం, నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయని మోదీ దేశాన్ని సమర్ధవంతంగా నడపడంలో ఘోరుంగా విఫలమయ్యారని అన్నారు.
మతం పేరుతో ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు కాషాయ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేశామని కానీ కాషాయ పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో ప్రియాంక ఎన్నికల సభల్లో మాట్లాడారు. తాము రైతుల రుణాలు మాఫీ చేస్తే కాషాయ పాలకులు సంపన్నుల రుణాలు మాఫీ చేశారని చెప్పారు. ఆవుల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతుంటారని, కానీ గోశాలల్లో గోవుల పరిస్ధితి దయనీయంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Mistake Surgery | చిన్నారికి చేతి వేలి సర్జరీ బదులు.. నాలుకకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు