Mistake Surgery | చిన్నారికి చేతి వేలి సర్జరీ బదులు.. నాలుకకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు
Mistake Surgery | బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్లు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక పేరెంట్స్ ఆందోళన చెందారు.
తిరువనంతపురం: బాలిక చేతి వేలికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే డాక్టర్లు ఆ చిన్నారి నాలుకకు ఆపరేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక పేరెంట్స్ ఆందోళన చెందారు. (Mistake Surgery) కేరళలోని కోజికోడ్‌లో ఈ సంఘటన జరిగింది. నాలుగేళ్ల బాలిక చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు ఆ చిన్నారిని పరిశీలించారు. చిన్న సర్జరీ ద్వారా ఆరో వేలిని తొలగించవచ్చని ఆ బాలిక పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో వారు దీనికి అంగీకరించారు.
కాగా, గురువారం ఆపరేషన్ థియేటర్ నుంచి వీల్‌చైయిర్‌లో తీసుకువచ్చిన చిన్నారి నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. అయితే ఆ బాలిక చేతికి ఆరో వేలు ఇంకా ఉంది. దీంతో పేరెంట్స్, కుటుంబ సభ్యులు నర్సును దీని గురించి ఆరా తీశారు. నాలుకకు కూడా సమస్య ఉండటంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారని ఆమె చెప్పింది. ఇది విని వారు షాక్ అయ్యారు.
మరోవైపు జరిగిన పొరపాటు తెలుసుకున్న డాక్టర్లు వారికి క్షమాపణలు చెప్పారు. బాలిక చేతికి ఉన్న ఆరో వేలిని సర్జరీ ద్వారా తొలగిస్తామని అన్నారు. ఆ చిన్నారిని తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. దీంతో ఆ పాప పేరెంట్స్, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- doctors
- finger surgery
- Girl
- mistake
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

