Tejashwi Yadav | రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (RJD) అగ్ర నాయకుడు, బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తేజస్వి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఆయన భద్రతా సిబ్బందిలోని ముగ్గురు గార్డులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. తేజస్వి యాదవ్ మాధేపురా నుంచి పాట్నాకు కారులో ప్రయాణిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో టీ తాగేందుకని వైశాలి జిల్లాలోని గోరౌల్ టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఒక హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది (Truck Crash).
ప్రమాదం జరిగినప్పుడు తేజస్వి యాదవ్ ధ్వంసమైన వాహనానికి అతి సమీపంలోనే ఉన్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముగ్గురు గార్డులు మాత్రం స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం హాజిపూర్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Shine Tom Chacko | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు షైన్ టామ్ చాకోను పరామర్శించిన కేంద్ర మంత్రి
Rs 500 Currency Notes | త్వరలో రూ.500 నోట్ల రద్దు..? ప్రభుత్వం ఏం చెప్పిందంటే..?
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట.. కేఎస్‌సీఏ సెక్రటరీ, ట్రెజరర్ రాజీనామా