Rs 500 Currency Notes | కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూ.2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 19 మే 2023న ఆర్బీఐ ప్రకటించింది. అయితే, త్వరలో దేశంలో రూ.500 నోట్లను (Rs 500 Currency Notes) కూడా ప్రభుత్వం రద్దు (Discontinued) చేయనుందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 2026 మార్చి నాటికి రూ.500 నోట్లను ఆర్బీఐ చెలామణి నుంచి ఉపసంహరించుకుంటుందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
‘కాపిటల్ టీవీ’ అనే యూట్యూబ్ ఛానల్ దీనిపై వీడియో సైతం రిలీజ్ చేసింది. 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు చాలామణీలో లేకుండా పోతాయని పేర్కొంది. 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) తాజాగా స్పందించింది. ‘ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు. అవి చలామణీలోనే ఉంటాయి. ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతుంది’ అని ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించింది.
Is the ₹500 note set to be phased out by 2026? 🤔
A #YouTube video on the YT Channel ‘CAPITAL TV’ (capitaltvind) falsely claims that the RBI will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck
✔️@RBI has made NO such announcement.
✔️₹500 notes have… pic.twitter.com/NeJdcc72z2
— PIB Fact Check (@PIBFactCheck) June 3, 2025
Also Read..
RBI | ఆర్బీఐ డబుల్ ధమాకా.. అర శాతం తగ్గిన రెపో రేటు
గోల్డ్ లోన్ ఎల్టీవీ రేషియో పెంపు